Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప జైలు నుంచి దస్తగిరి విడుదల

Dastagiri released from Kadapa jail
Advertisement
  • వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి
  • గతేడాది దస్తగిరిపై అట్రాసిటీ, దాడి కేసులు
  • 4 నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి
  • ఇటీవల రెండు కేసుల్లోనూ బెయిల్ 
Advertisement
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అట్రాసిటీ, దాడి కేసుల్లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో దస్తగిరికి ఇటీవల బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో, దస్తగిరి నేడు కడప జైలు నుంచి విడుదలయ్యాడు. 

ఓ ప్రేమ జంట వ్యవహారంలో దస్తగిరిపై అట్రాసిటీ, దాడి కేసులు నమోదు కాగా, గత 4 నెలలుగా దస్తగిరి కడప జైల్లో రిమాండ్  ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో, జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య దస్తగిరి పులివెందుల వెళ్లాడు. అంతకుముందు, తన విడుదలపై జైలు గెస్ట్ హౌస్ లో ఉన్న సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు.
Advertisement
Advertisement
Dastagiri
Bail
Kadapa Jail
YS Vivekananda Reddy

More Telugu News